ఒకే చోట రెండు రోజుల్లో రెండు ప్రమాదాలు.



 ఒకే చోట రెండు రోజుల్లో రెండు ప్రమాదాలు.

వాహన దారులూ.... జాగ్రత్త వహించండి.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొబ్బరివూరు సమీప 16 వ నంబర్ జాతీయ రహదారి వద్ద గత రెండు రోజుల్లో రెండు వాహన ప్రమాదాలు చోటుచేసుకోడం గమనార్హం.

శుక్రవారం నాడు ఉదయం సోంపేట కు చెందిన ఓ ద్విచక్రవాహణదారుడు రోడ్డు ప్రమాదానికి గురి కాగా,నేడు అదే ప్రదేశంలో, సోంపేటకు చెందిన తల్లి కొడుకులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ సునకాన్ని ఢీ కొట్టి తీవ్ర గాయాలపాలయ్యారు.

సమాచారమందుకున్న పలాస 108 సిబ్బంది సత్యం,వెంకట్రావులు ప్రధమ చికిత్స అందించి పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా,వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

జాతీయరహదారికి సర్వీస్ రోడ్డు లేని కారణంగానే నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని,అధికారులు దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతుండగా,వాహనదారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post