10 మందికి పెట్టి చాకిరి నుండి విముక్తి. రిలీఫ్ సరిఫికెట్లు
అందజేసిన కలెక్టర్, జే.సీ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని పి గుడిపాడు గ్రామం లో దాదాపు 11 ఏళ్ల నుంచి సుబాబుల్ కర్ర నరికే పనిలో వెట్టిచాకిరి చేస్తున్న 10 మందికి కలెక్టర్ పి.రాజాబాబు విడుదల కల్పించారు.
శుక్రవారం కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామంలో నిర్వహించిన ' పల్లె నిద్ర ' కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారితో కలిసి రిలీఫ్ సర్టిఫికెట్లు అందించారు. వీరికి సంబంధిన వివరాలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన 3 గిరిజన కుటుంబాలు తాళ్లూరు మండలం వెలిగూరిపాడు గ్రామానికి చెందిన సుబాబులు తోట కలిగిన శ్రీనివాసులు రెడ్డి అనే రైతు వద్ద వెట్టి చారికీ చేస్తున్నారు. 11 ఏళ్ల క్రితం వీరికి రూ.20 వేలు ఇచ్చి, ఆ డబ్బులను జమ చేసుకునే పేరుతో వీరితో వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు గిరిజన సంఘాల నాయకుల ద్వారా అధికారులు గుర్తించారు. అనంతరం బాధితులను విడిపించి, కలెక్టర్ ఆదేశాల మేరకు పునరావాస కల్పనకి చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో జాన్సన్, డీ.పీ.వో. వెంకటేశ్వర రావు, జెడ్పీ సీ.ఈ.వో. చిరంజీవి, ఇతర అధికారులు, యానాది మహా కూటమి రాష్ట్ర కమిటీ సభ్యుడు చేవూరి వెంకటేశ్వర్లు, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


