ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS )ముఖ్య ఉద్దేశం - మార్కాపురం శాసనసభ్యులు కందుల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా పొదిలి లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న " ఒక నియోజకవర్గం- ఒక నెల -నాలుగు వారాలు " కార్యక్రమంలో భాగంగా మూడవ శుక్రవారం " ప్రజా సమస్యల పరిష్కార వేదిక (P. G. R. S) కార్యక్రమం పొదిలి పట్టణంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా జిల్లా కలెక్టర్ ఎం .విజయ సునీత , జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు , డిఆర్ఓ ఎం. శివరాం రెడ్డి గారు విచ్చేశారు.
ఈ ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో 240 మంది అర్జీలు అందజేశారు

