ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, హర్షిణి డిగ్రీ కళాశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో , ఒంగోలు నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఈ జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీలైన, ఆక్సిస్ బ్యాంకు , హెటిరో డ్రగ్స్, డాక్టస్ బిజినెస్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఇండో సోలార్ ప్రవేట్ లిమిటెడ్ , జే కే టైర్స్ , టాటా ఎలక్ట్రకిన్స్, చోళ గోల్డ్ లోన్ ప్రతినిధులు హాజరవడం జరిగింది. ఈ కంపెనీలకు (287) మంది హాజరుకాగా వారిలో 112మంది కంపెనీలకు ఎంపిక అవడం జరిగిందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జే రవితేజ గారు , కళాశాల ప్రిన్సిపాల్ దండే ఆంజనేయులు గారు తెలియజేశారు.
కళాశాల చెర్మెన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు నిర్వహించే జాబ్ మేళా లను మరియు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, అదే విధంగా హాజరైన యువత అందరూ వారి వారి విద్యార్హత మరియు వారి అనుభవాన్ని బట్టి ఉద్యోగాలు పొంది మంచి అత్యుత్తమైన స్థానాలు పొందాలని ఇటువంటి జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధి అధికారి రమాదేవి , స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది మరియు కళాశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.
