మహిళ భద్రతపై అవగాహన తెలియజేస్తున్న మార్కాపురం సిఐ అల్తాఫ్ హుస్సేన్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేటు స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కాపురం సిఐ అల్తాఫ్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలల మరియు మహిళల భద్రత ముఖ్యమైన జాగ్రత్తలు బాలల భద్రత అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదని పిల్లలకు చెప్పాలి.
తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లకూడదు.స్కూల్‌కు వెళ్లే మార్గం మరియు అత్యవసర ఫోన్ నంబర్లుగుర్తుంచుకోవాల్లన్నారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదు.
ఎవరు అనుచితంగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు .
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు జాగ్రత్తగా మూసుకోవాలి.
ఆన్‌లైన్ గేమ్స్, వీడియో కాల్స్ ద్వారా అపరిచితులతో స్నేహం చేయరాదు.
మహిళల భద్రత రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
అత్యవసర నంబర్లు మొబైల్‌లో సేవ్ చేసుకోవాలని అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
ఆటో/క్యాబ్ వాహన నంబర్‌ను కుటుంబసభ్యులతోపంచుకోవాలి.
సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, లొకేషన్ వివరాలు జాగ్రత్తగా ఉపయోగించాలి.
వేధింపులు, మోసాలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలన్నారు
మహిళల హెల్ప్‌లైన్ 181 మరియు పోలీస్ అత్యవసర నంబర్ 112 గురించి అవగాహన కలిగి ఉండాలి.
సాధారణ భద్రత సూచనలు
సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాల్లోనే ఎక్కువగా ఉండాలని తెలిపారు .
మోసపూరిత కాల్స్, OTP అడిగే వారిని నమ్మకూడదు.
పిల్లలు మరియు మహిళలపై నేరాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిజేశారు.
సమాజంలో పరస్పర గౌరవం మరియు భద్రతపై అవగాహన పెంచాలన్నారు .
అలాగే ప్రజలకు బాలల మరియు మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, సైబర్ మోసాలు, ఈవ్ టీజింగ్, బాలలపై నేరాలు వంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అలాగే సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను నమ్మవద్దని మరియు అత్యవసర పరిస్థితుల్లో 112, 1098, 1091 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సిఐ అల్తాఫ్ హుస్సేన్ పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి పోలీస్ సిబ్బంది మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
