మార్కాపురంలో దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ మోటార్ బైక్ లు పంపిణీ చేసిన మంత్రి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా మార్కాపురంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా,, డోల బాలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ దివ్యాంగులకు మేలు చేసే విషయంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందే ఉంటారన్నాఅన్నారు. ఈరోజు రూ.17.5 కోట్లతో రాష్ట్రంలో 1750 మంది దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ బైక్ లు పంపిణీ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో దివ్యాంగులకు ప్రతి నెలా రూ.6 వేలు, రూ. 15 వేలు పింఛన్ ఇస్తున్నామని తెలిపారు.
దివ్యాంగ శక్తి పధకంతో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.
చరిత్రలో ఎన్నడు లేని విధంగా రూ. 4.38 కోట్లతో దివ్యాంగ మరమ్మతులు చేస్తున్నాం
దివ్యాంగుల కోసం బాపట్లలో ప్రత్యేకంగా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
దివ్యాంగుల కోసం విశాఖలో రూ. 200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తున్నామన్నారు.
ప్రతి జిల్లాలో దివ్యాంగ భవన్ లు నిర్మిస్తాం.దివ్యాంగ బ్యాక్ లాంగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం అని తెలిపారు.త్వరలో నియామక పత్రాలను అందజేస్తామని అన్నారు.దివ్యాంగుల కోసం కలెక్టరేట్లలో ప్రత్యేకంగా లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తున్న మన్నారు.
దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే ఇంద్రధనస్సు హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత. జాయింట్ కలెక్టర్. పి శ్రీనివాసరావు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి. గూడూరి ఎలక్షన్ బాబు. మార్కాపురం శాసనసభ్యులు. కందుల నారాయణరెడ్డి. కనిగిరి శాసనసభ్యులు. ఉగ్ర నరసింహారెడ్డి. గిద్దలూరు శాసనసభ్యులు. ముత్తుమల్ల అశోక్ రెడ్డి. మార్కాపురం ఇన్చార్జి. ఇమ్మడి కాశీనాథ్. కూటమి నాయకులు దివ్యాంగులు తదితర అధికారులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


