లాడ్జిలను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎస్సై.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండల కేంద్రంలో పలు లాడ్జిలను బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి తనిఖీలు నిర్వహించారు.
అనంతరం లాడ్జి యజమానులకు వివిధ సూచనలు ఇచ్చారు. ఎవరైనా లాడ్జిలకు వస్తే వారి ఆధార్ ఆధారంగా మరియు వారు ఏ పని మీద వచ్చారు. అని పూర్తి వివరాలు తెలుసుకొని సరైన ఆధారాలతో రూమ్ ఇవ్వాలని పేర్కొన్నారు.
అలాగే లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా. అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చిన ఎడల పోలీసులకు సమాచారం ఇవ్వాలని లాడ్జ్ యజమానులకు సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి తెలిపారు.
