నూరు శాతం అక్షరాస్య సాధించడమే లక్ష్యం గా పని చేయాలి అధికారులకు కలెక్టర్ ఆదేశం.


 నూరు శాతం అక్షరాస్య సాధించడమే లక్ష్యం గా పని చేయాలి అధికారులకు కలెక్టర్ ఆదేశం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మార్కాపురం జిల్లాలో మార్చి 2027 నాటికి జిల్లాలో 100% అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు.

శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఉల్లాస్ అక్షర ఆంధ్ర జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత లో 70,957 నిరక్ష్య రాస్యులు ఉన్నారని ఉల్లాస ఆంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యులు గా తయారు చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

జిల్లాలో 15 నుంచి 59 సంవత్సరాలు లోపు వారిని అక్షరాస్యులు గా తీర్చిదిద్దడమే 

మీ ముందున్న లక్ష్యమన్నారు. గ్రామాల్లో ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల లోపు అంగన్వాడి కేంద్రాల్లో, ప్రభుత్వ పాఠశాలలో ఎంపిక చేయబడిన కేంద్రాల్లో తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. ఉల్లాస అక్షర ఆంధ్ర కార్యక్రమం కింద 100 గంటలు పాఠ్యాంశాలు నేర్పించాలన్నారు. అదే విధంగా డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించాలన్నారు. స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య నోడల్ అధికారి ప్రభాకర్, డిఆర్డిఏ పిడి నీలకంఠారెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, డ్రామా పీడి నిర్మలాదేవి, ఐసిడిఎస్ ఇన్చార్జి పీడీ పద్మావతి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఇఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post