ఆపఆపరేషన్ క్లిన్ స్వీఫ్ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్.రేషన్ క్లిన్ స్వీఫ్ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్.


 ఆపరేషన్ క్లిన్ స్వీఫ్ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు,పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని, "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న "ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం" కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మున్సిపాలిటీ ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, సంతనూతలపాడు శాసన సభ్యులు బి ఎన్ విజయకుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుండి నెల్లూరు బస్టాండ్ వరకు చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సంతనూతలపాడు శాసనసభ్యులు స్వయంగా పాల్గొని చీపుర పట్టి పారిశుధ్య పనులను చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు బస్టాండ్ వద్ద తాటి ముంజలు అమ్ముకునే వారితో, తోపుడు బండి పై రాగి జావా అమ్ముకునే వారితో, ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంగోలు నగరపాలక సంస్థ తరపున "ఆపరేషన్ క్లీన్ స్వీప్" అనే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఒంగోలు నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ రోజు ప్రారంభిస్తున్న "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగు అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సూచనలు మేరకు "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమాన్ని మే 23వ తేదీ నుండి నాలుగు వారాలపాటు ఒక క్రమపద్ధతిలో అమలు చేయబడుతుందని, మొదటి వారంలో నగరంలోని చెత్త ఎక్కువగా పేరుకుపోయే రెడ్ స్పాట్లు (ఎక్కువగా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు) మరియు యెల్లో స్పాట్లు (పాక్షికంగా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు) పూర్తిగా తొలగించడంపై దృష్టి సారించడం, రెండవ వారంలో కాలువలు మరియు డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రపరిచి, నీటి నిల్వలు మరియు వరద సమస్యలను నివారించడానికి చర్యలు తీసుకోవడం, మూడవ వారంలో నివాస మరియు వాణిజ్య ప్రాంతాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, నాల్గవ వారంలో పబ్లిక్ టాయిలెట్స్, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర ప్రజా ప్రదేశాలను శుభ్రపరచడం ద్వారా హైజీన్ ప్రమాణాలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మున్సిపల్ సిబ్బంది కృషితో పాటు ప్రజల సహకారం కూడా అత్యంత అవసరం. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, పారిశుధ్య కార్మికులకు అందించాలి. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్, ఈ సందర్భంగా నగర ప్రజలకు సూచించారు.

అన్నీ వర్గాల ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తేనే 'ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమం విజయవంతమవుతుందని, ఇది కేవలం నాలుగు వారాల కార్యక్రమం మాత్రమే కాదని, నిరంతరం కొనసాగించి శాశ్వత పరిశుభ్రత సంస్కృతిని ఏర్పరచుకోవాలన్నారు.

ఒంగోలు నగరాన్ని ఒక ఆదర్శ పరిశుద్ధమైన నగరంగా మార్చడంలో చేపట్టే పారిశుధ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. 

సంతనూతలపాడు శాసన సభ్యులు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్నీ నగరాలు, పట్టణాలల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి 4 వారాల పాటు జరుపుకోవడం జరుగుచున్నదని, అందులో భాగంగా ఈ రోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఒక నగరం అభివృద్ధి చెందినదని చెప్పాలంటే, ముందుగా అది పరిశుభ్రంగా ఉండాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా రావని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రభుత్వం చేపట్టే పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. 

ఈ కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకట క్రిష్ణయ్య, ఒంగోలు కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post