మహానాడు కార్యక్రమానికి క్షేత్ర స్థాయిలో పరిశీలన - వజ్జ.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఏపీటీపీసీ చైర్మన్ & తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు నేడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన సందర్భంగా లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి. సిగడాం మండలాల్లోని 10 క్లస్టర్ల పరిధిలో విస్తృతంగా పర్యటించి, మహానాడు విజయవంతం కోసం చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు భారీ ఎత్తున్న చేస్తున్నారు.
ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్‌చార్జులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సభా ప్రాంగణాలు, వసతి, భోజన ఏర్పాట్లు, రవాణా, పార్కింగ్, తాగునీరు, శానిటేషన్ తదితర అంశాలపై సవివరంగా చర్చించారు. మహానాడుకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి మహానాడును చారిత్రాత్మక విజయంగా నిలపాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల ఉత్సాహం, నాయకుల సమన్వయం చూస్తుంటే మహానాడు విజయవంతం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి సంకల్పం ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే వేదికగా మహానాడు నిలవాలని పేర్కొన్నారు. పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనాయకులు నారా లోకేష్ గారి సమష్టి కృషితో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ముఖ్య నేతలు కలిశెట్టి సూర్యనారాయణ, భువనేశ్వర్, గాలి రమణ రెడ్డి, తోటయ్య దొర , నారాయణ, శ్రీనివాస్, రాము నాయుడు, వంశీ, కృష్ణారావు,జగపతి బాబు, జక్కంపూడి దాసు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

