రాజకీయ రంగం లో మహిళకు ప్రాధాన్యత.
* టీడీపీ లో 33 శాతం సీట్లు
* మహానాడులో ప్రకటించిన నారా లోకేష్
* ధన్యవాదాలు తెలిపిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస : తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారని, రాజకీయ రంగంలో మహిళలను ప్రోత్సహిస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు
మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మహానాడులో ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ రాజకీయాల్లో మహిళలు అనే అంశంపై మాట్లాడుతూ పార్లమెంట్లో ఇటీవల మహిళా బిల్లు వీగిపోయినప్పటికీ టిడిపి మాత్రం మహిళలకు 33% రాజకీయాల్లో చోటు కల్పిస్తుందని ప్రకటించారు. దీంతో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆది నుంచి రాజకీయరంగంలో మహిళలకు ఎనలేని ప్రోత్సాహం అందిస్తున్నారని, ఓ మహిళను శాసనసభాపతిగా ఎన్నుకున్న ఘనత టిడిపిదని గుర్తు చేశారు
టిడిపి ఆవిర్భావం నుంచి నేటి వరకు అదే ఒరవడిని కొనసాగిస్తూ మహిళల్లో రాజకీయ చైతన్యాన్ని రగులుస్తున్నారని కొనియాడారు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా మహిళలకు పెద్దపీట వేశారని మంత్రులుగా మహిళలు పనిచేస్తుండడం ఇందుకు నిదర్శనం అన్నారు. మరోవైపు పార్టీ కమిటీల్లో కూడా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని కితాబునిచ్చారు.
