ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారించాలి:ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.




ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారించాలి:ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక"( మీకోసం) కార్యక్రమంకు 66 ఫిర్యాదులు

ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫిర్యాదు దారుల అర్జీలను జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు స్వయంగా స్వీకరించి,

వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు.

ఫిర్యాదులను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. నడవలేని వారి వద్దకు జిల్లా ఎస్పీ స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

ప్రత్యేకంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మరియు ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీ తక్షణమే ఆదేశాలు జారీ చేశారు.

ప్రజా సమస్యలపై వెంటనే విచారణ చేపట్టి, చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు సత్వరం న్యాయం అందించేలా చూడాలని ప్రకాశం ఎస్పీ వి విష్ణువర్ధన్ రాజ్ ఆదేశించారు.

జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.

 ఈ కార్యక్రమంలో ఎక్కువ భూ వివాదాలు, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్ మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి. 

ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ పి.శ్రీధర్, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హాజరత్తయ్య, సంతమాగులూరు సీఐ శేషగిరి రావు,కొండేపి సీఐ రమణయ్య, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post