అనకాపల్లి జిల్లాలో మాదకద్రవ్యాల స్మగ్లర్‌పై ఉక్కుపాదం


 అనకాపల్లి జిల్లాలో మాదకద్రవ్యాల స్మగ్లర్‌పై ఉక్కుపాదం

PIT NDPS చట్టం కింద నిందితుడి నిర్బంధం.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

నర్సీపట్నం రూరల్ , ఏప్రిల్ 25:

జిల్లాలో గంజాయి విక్రయాలు మరియు అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కఠిన ఆదేశాల మేరకు, నర్సీపట్నం సబ్ డివిజన్ అధికారి పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.

నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని గొలుగొండ మండలం, రావణపల్లి గ్రామానికి చెందిన గొర్లి గంగు నాయుడు @ చిన్న (28 సంవత్సరాలు), తండ్రి: లేట్ నూకరాజు, వృత్తి: డ్రైవర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి అనకాపల్లి మరియు ఇతర ప్రాంతాలకు అక్రమంగా గంజాయిని తరలిస్తూ వరుస నేరస్థుడిగా (Habitual Offender) వ్యవహరిస్తున్నాడు.

ఇతనిపై గతంలో గొలుగొండ పోలీస్ స్టేషన్‌తో పాటు పాయకరావుపేట మరియు ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. గంజాయి తరలింపు కేసుల్లో పలుమార్లు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ, అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.

సమాజంపై మరియు ప్రజారోగ్యంపై అతని చర్యల దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు PIT NDPS చట్టం,1988 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేయబడినవి.

ఈ ఆపరేషన్‌లో నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ ఎస్సై రామారావు, NDPS సెల్ ఇన్స్పెక్టర్ పిల్లా రమేష్ మరియు సిబ్బంది కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకుని, పకడ్బందీగా జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...

జిల్లాలో గంజాయి వ్యాపారంపై నిరంతర నిఘా కొనసాగుతుందని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ఇలాంటి కఠిన చట్టాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post