మార్కాపురం జిల్లా.తర్లుపాడులో తప్పిన రైలు ప్రమాదం: గూడ్స్ రైలులో పొగలు.


 మార్కాపురం జిల్లా.తర్లుపాడులో తప్పిన రైలు ప్రమాదం: గూడ్స్ రైలులో పొగలు.

 తర్లుపాడు రైల్వే స్టేషన్‌లో శుక్రవారం 06 భారీ ప్రమాదం తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో ఒక్కసారిగా పొగలు రావడంతో రైల్వే అధికారులు, స్థానికులు అప్రమత్తమయ్యారు.

అసలేం జరిగిందంటే?

బొగ్గును రవాణా చేస్తున్న గూడ్స్ రైలు తర్లుపాడు స్టేషన్ పరిధిలోకి రాగానే, అందులోని ఒక బోగీలో ఉన్న బొగ్గు నుంచి దట్టమైన పొగలు రావడం గమనించారు. వెంటనే రైలును నిలిపివేసిన సిబ్బంది, మార్కాపురం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది:

సమాచారం అందుకున్న వెంటనే మార్కాపురం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు బోగీలో డ్రై కెమికల్ పౌడర్‌ను చల్లి పొగలను అదుపు చేశారు. పొగలు పూర్తిగా ఆగిపోయి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడే ఉండి పర్యవేక్షించారు.

తప్పిన ముప్పు:

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో రైల్వే అధికారులు మరియు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బొగ్గులో ఏర్పడిన వేడి కారణంగానే ఈ పొగలు వచ్చినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు....

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post