మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం.
ఘనంగా నివాళులర్పించిన అనకాపల్లి పోలీసులు.
క్రైమ్9మీడియా జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి, ఏప్రిల్ :11అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు, జిల్లా పోలీసు కార్యాలయంలో సామాజిక విప్లవకారుడు, "మహాత్మా" జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
జిల్లా ఎస్పీ సూచనల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి మాట్లాడుతూ..
"భారతదేశంలో అక్షరాస్యత, ప్రత్యేకించి మహిళా విద్య కోసం పునాదులు వేసిన గొప్ప సంస్కర్త జ్యోతిరావు పూలే. కుల రహిత సమాజం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది."
పూలే ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని బలహీన వర్గాలకు, మహిళలకు భద్రత కల్పిస్తూ, సామాజిక న్యాయాన్ని కాపాడటంలో అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుంది."
"చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆయన మార్గంలో నడుస్తూ, నేటి యువత విద్యతో పాటు ఉన్నత విలువలను అలవరుచుకోవాలని తెలిపారు ఈ నివాళులర్పించే కార్యక్రమంలో అనకాపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ జి.అశోక్ కుమార్, జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనా సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. పూలే స్ఫూర్తితో ప్రజా సేవలో నిరంతరం పునరంకితం అవుతామని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
