భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకను ఘనంగా జరుపుకుందాం.


భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకను ఘనంగా జరుపుకుందాం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి.రాజ బాబు వారి అధ్యక్షతన తేది.14.04.2026 న శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా, ఒంగోలు వారిచే, ఉదయం గం.10.00 ని..ల కు ఒంగోలు లోని హెచ్.సి.ఎం కళాశాల ఎదురుగా గల డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహమునకు పుష్ప మాలంకరణ మరియు ఉదయం గం.10.15 ని..ల కు డా.బి.ఆర్.అంబేద్కర్ భవనమునకు పోవు దారిలో ఉన్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహమునకు పుష్ప మాలంకరణ తదుపరి ఉదయం గం.10.30 ని||ల కు అంబేద్కర్ భవనము లోని డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహమునకు పుష్ప మాలంకరణ కార్యక్రమము నిర్వహించబడును. 

తదుపరి డా.బి.ఆర్. అంబేద్కర్ భవనము నందు జ్యోతి ప్రజ్వలన, డా.బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్ర పటమునకు పుష్పమాలాంకరణ, మరియు ఉదయం గం.10.40 ని..లకు గౌరవ అతిధుల ఉపన్యాస కార్యక్రమము నిర్వహించబడును.  

కావున, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, షెడ్యూల్డ్ కులముల షెడ్యూల్డ్ తెగల సంఘ నాయకులు, ప్రజలు మరియు మీడియామిత్రులు తేది: 14.04.2026న జరుగు డా.బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి మహోత్సవ సభకు విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ పి.రాజ బాబు వారు నేడొక ఒక ప్రకటనలో తెలిపారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post