వృద్ధాశ్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు.


 వృద్ధాశ్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు.

అనకాపల్లి ఏప్రిల్:12  చీడికాడ మండలం అప్పలరాజు పురం గ్రామంలో శ్రీ లలిత దేవి వృద్ధాశ్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలు ఆశ్రమం నిర్వాహకురాలు యాళ్ల వెంకటలక్ష్మి అలంకరించారు. ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముర్తా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే సంఘసంస్కర్ణకర్త సమసమాజ నిర్మాణం కోసం ఎంతో పాటు పడ్డారని, స్త్రీ విద్య కోసం ఎంతగానో, కృషి చేశారన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలే దేశంలో మొదటి ఉపాధ్యాయురాలు అన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురువు మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన ను మనo ఆదర్శంగా తీసుకోవాలని అనగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో ఆశ్రమంలో స్టాప్ దంతులూరి గంగాభవాన్ని, కురచా లక్ష్మి (రాజమ్మ), జెర్రిపోతుల వరహాలమ్మ, గల్లా నాగమణి నూకరాజు, కురచా కిరణ్మ్మ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post