రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని జె పి పుల్లలచెరువులో వెలసిన ప్రముఖ శ్రీ నెమలి గుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పాల్గొని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కు ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయ పరిసరాలను పరిశీలించి
ఉత్సవాల ప్రత్యేకతను, ఆలయ చరిత్రను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
శనివారం జరగబోయే తెప్పోత్సవ ఏర్పాట్లు సైతం ఆమె పరిశీలించారు,
గుండంలో జరిగేఈతెప్పోత్సవాన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, ఆలయ ఈవో నాగయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
