కన్నుల పండుగ లా నెమిలిగుండ్ల రంగనాయకస్వామి కళ్యాణం.


 కన్నుల పండుగ లా నెమిలిగుండ్ల రంగనాయకస్వామి కళ్యాణం.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

భక్తి శ్రద్ధలతో కళ్యాణం మహోత్సవం వీక్షించేలా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ముత్తుముల

మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జె. పుల్లల చెరువు గ్రామంలో స్వయంగా వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారి బ్రహ్మోత్సవములు సందర్భంగా నేడు స్వామి వారి కళ్యాణం జరిగింది,

ఈ వేడుకలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ధర్మపత్ని శ్రీమతి పుష్పాలిలా గార్లు స్వామి వారి కళ్యాణం మహోత్సవం లో పాల్గొని స్వామివారికి వస్త్రాలు , సమర్పించి కన్నుల పండుగగా కళ్యాణం జరిపించారు,

 వీరితో పాటుగా ఒంగోలు శాసనసభ్యులు దామoచర్ల జనార్దన్ వారి కుటుంబ సభ్యులు , రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి , ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి , కళ్యాణం మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీర్వాదం పొందారు,

అనంతరం జిల్లా నాయకులకు అందరికీ శాలువా పూల మాలతో ఘనంగా సన్మానించారు స్వామి వారి ప్రతిమ , తీర్థ ప్రసాదాలు అందించి ప్రతీ సంవత్సరం ఈ కళ్యాణ వేడుకలో పాల్గొనాలి అని తెలిపారు

 గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే వేలాది మంది ప్రజలకు, భక్తులకు మునుపెన్నడూ లేని విధంగా స్వామి వారి దర్శనం కల్పించారు, 

ఎండలు ఎక్కువగా ఉంటాయని ముందే త్రాగు నీరు , మజ్జిగ , పందిళ్లు , భోజన వసతులు అన్నీ ఏర్పాటు చేసి ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కళ్యాణం వీక్షించేలా తగు సదుపాయాలు తీసుకోవడం జరిగింది,

 ఈ కార్యక్రమానికి జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు నిర్వహించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post