కె జీ బి వి విద్యార్థినులను అభినందించిన ఉన్నతాధికారులు.


 కె జీ బి వి విద్యార్థినులను అభినందించిన ఉన్నతాధికారులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థను శిఖరాన నిలబెట్టిన కేజీబీవీ విద్యార్థినులు – ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు

ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (KGBV) విద్యార్థినులు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయిలలో విశిష్ట స్థానాలను దక్కించుకున్నారు.

ఇంటర్ వృత్తి విద్య (ఒకేషనల్ ) విభాగంలో కేజీబీవీ విద్యార్థిని కటికెల భాగ్య 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకును కైవసం చేసుకొని ప్రకాశం జిల్లా గౌరవాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చింది.

అలాగే ఎంపీసీ విభాగంలో కామినేని భవాని 1000లో 985 మార్కులు సాధించి ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలలలో ప్రకాశం జిల్లా ప్రథమ ర్యాంకును సాధించగా, భీమవరపు వేంకట శిరీష 982 మార్కులతో జిల్లా మూడవ ర్యాంకును పొందింది. అదేవిధంగా కేజీబీవీ విభాగంలో ఎం. సుజాత 979 మార్కులతో బైపీసీ విభాగంలో జిల్లా ప్రథమ స్థానం సాధించడం విశేషం.

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా గౌరవ కలెక్టర్ & సమగ్ర శిక్షా చైర్మన్ రాజబాబు, ఐఏఎస్ , జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, ఐఏఎస్ PGRS హాల్లో విద్యార్థులతో మాట్లాడి వారిని అభినందిస్తూ వారి కృషి, పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థినుల ప్రతిభ రాష్ట్రస్థాయిలో ప్రతిష్టను సాధించేలా మార్గనిర్దేశం చేసిన సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ దాసరి గారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జీసీడీవో శ్రీమతి కె.ఎం. హేమలత గారు, సంబంధిత అధికారులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కేజీబీవీ విద్యార్థినుల ఈ ఘన విజయం జిల్లా విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలకు దారి చూపనుందని సమగ్ర శిక్షా, ప్రకాశం జిల్లా అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post