ప్రపంచ మేధావికి ఘన నివాళులు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండల కేంద్రంలో ని ఎంపీడీవో మరియు తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక ఎంపీడీవో అధ్యక్షతన ఈ జయంతి వేడుకల్లో ముఖ్య అతిధులుగా బహుజన పరిరక్షణ సమితి నాయకులు దాసరియోబు. డి రఘు బిజెపి సీనియర్ నాయకులు జి వి రమణారావు. మాజీ సర్పంచ్ మునగల వసంతమ్మ. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్య. రెవిన్యూ సిబ్బంది. బహుజన నాయకులు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి. జే బీ. సత్యానంద్. ప్రసాద్. పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
దాసరియోబు మాట్లాడుతూ భారతరత్న రాజ్యాంగ నిర్మాత సామాజిక సంస్కర్త విద్య వేత్త ఆర్థిక నిపునుడు న్యాయ గోవిదుడు ప్రగాఢ దేశభక్తుడని కొనియాడారు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రాన్ని నోటు మీద ముద్రించాలని ఆయన కోరారు.
ఎంపీడీవో కాసిం పీరా మాట్లాడుతూ ఆర్థిక సామాజిక రాజకీయ విద్యా రిజర్వేషన్స్ ద్వారా భారత కులాల ఐక్యతకు ఏకీకరణ కొరకు అంబేద్కర్ గారు పాటుపడ్డారని ఆయన తెలిపారు.
డి రఘు మాట్లాడుతూ లండన్ యూనివర్సిటీలో మొట్టమొదటిగా ఎన్నో డిగ్రీ పొందిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు తెలిపారు కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారము పార్లమెంటు శాసనసభలలో చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచారని ఆయన అన్నారు.
జివి రమణ రావు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత మేధావి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారేఅని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం విద్యా ఉద్యోగాలలో మహిళలకు బీసీ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్ధవీడు స్థానిక ఎంపీడీవో. షేక్. కాసిం పీరా. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్. శివ నాచారయ్య. రెవెన్యూ సిబ్బంది. హాజరయ్య. బండి వెంకటేశ్వర్లు. మోత శ్రీనివాసులు. మంద ప్రసంగి. తదితరులు పాల్గొని ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు.

