ప్రపంచ మేధావి డా,, బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్న ముత్తుముల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని క్లబ్ రోడ్డు వద్ద డా " బి. ఆర్.అంబేద్కర్ గారి 135 వ జయంతి వేడుకలోఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం గిద్దలూరు శాసన సభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ 1947 లో స్వాతంత్రం వచ్చిన తరువాత మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం ఎన్నో రాష్ట్రాల , కులాలతో ఉన్నది అని అన్ని వర్గాలు , కులాలతో ఉండటానికి కారణం ఆ మహనీయుడు డా,, బి ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ అని కూడా రాబోవు రోజుల్లో ఆయన కలలు నెరవేర్చే దిశగా మనం అందరము కలిసి ముందుకు వెళ్లాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యస్ సెల్ నాయకులు గోన చెన్న కేశవులు మండల మరియు పట్టణ నాయకులు , అధికారులు మరియు జై భీమ్ అభిమానులు. ప్రజలు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు
