దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభల విజయవంతం చేయండి. కరపత్రాలు విడుదల.


 దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభల విజయవంతం చేయండి. కరపత్రాలు విడుదల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

-మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పందిటి మోహన్. 

ఫోటో రైట్ అప్: మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జి పి రామారావు. 

కనిగిరి: దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు మే నెల మూడో తేదీ విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయం నందు నిర్వహిస్తున్నందున నియోజకవర్గంలోని దళితులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పందిటి మోహన్ కోరారు. 

మంగళవారం కనిగిరిలోని దరిశి చెంచయ్య భవన్ నందు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభల కరపత్రాలను వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి జిపి రామారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ప్రజలకు సుప్రీంకోర్టు తీరని అన్యాయం చేస్తుందని మతం మారినంత మాత్రాన కులం మారుతుందా అని అన్నారు దళితులు క్రైస్తవ మతం పుచ్చుకుంటే రిజర్వేషన్లు తీసేస్తామంటూ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయని ఎస్సీ ఎస్టీ హోదా కూడా పూర్తిగా రద్దు అవుతుందని చెప్పటం శోచనీయమని అన్నారు అంటరానితనం వివక్ష నేటికి గ్రామాలలో పట్టణాలలో విలయతాండం ఆడుతుందని వాటిని నిర్మూలించడంలో ప్రభుత్వాలు విఫలం చెందియ్యని అన్నారు, బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చి 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఉద్యోగ కల్పన చేయడం మానేసి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు ఫారం చేస్తున్నాయని దియబెట్టారు ప్రభుత్వం ఎటువంటి బాధ్యతను నిర్వర్తించకుండా ప్రజలపై భారాలు మోపుతున్నారని అన్నారు దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా దళిత ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన చూసించారు ఇక ఆంధ్రప్రదేశ్లో గత వైసిపి ప్రభుత్వం 27 పథకాలు దళితులకు రద్దయాయని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే ఆ పథకాలను పునర్దరిస్తామంటూ పగడ్బాలు పలికి పగ్గాలు చేపట్టంగానే ఆ మాటను గాలికి వదిలేసారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బండితిరుపాలు, యోహాన్, సాల్మన్, తాహిద్, ఇఫ్రాజ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post