పరారీలో ఉన్న గంజాయి నిందితుడి అరెస్ట్: అనకాపల్లి పట్టణ పోలీసుల చాకచక్యం.


 పరారీలో ఉన్న గంజాయి నిందితుడి అరెస్ట్: అనకాపల్లి పట్టణ పోలీసుల చాకచక్యం.

క్రైమ్9 మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, ఏప్రిల్ 28,  జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హ ఆదేశాల మేరకు, సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి పర్యవేక్షణలో, అనకాపల్లి పట్టణ పోలీసులు గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఒక కీలక గంజాయి నిందితుడిని అరెస్ట్ చేశారు.కేసు వివరాలు: 

ఈ ఏడాది జనవరి నెలలో అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక గంజాయి కేసులో నిందితుడైన నీలగిరి హరీష్‌ (తండ్రి: లేట్ శ్రీనివాసరావు, సుబ్రమణ్య కాలనీ, అనకాపల్లి) అప్పటి నుండి పోలీసుల కళ్లు గప్పి బెంగళూరు తదితర ప్రాంతాలలో తలదాచుకుంటున్నాడు.

తేదీ 27.04.2026 అర్ధరాత్రి సమయంలో నిందితుడు అనకాపల్లిలోని సుబ్రమణ్య కాలనీలో సంచరిస్తున్నట్లు పట్టణ SHO జీ.ప్రేమ కుమార్కి నమ్మదగిన సమాచారం అందింది. వెంటనే స్పందించిన SHO, తన సిబ్బంది ఎస్సై డి.శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు బృందాన్ని అప్రమత్తం చేశారు. మెరుపు దాడి నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు కస్టడీలో నిందితుడు హరీష్ తన నేరాన్ని అంగీకరించాడు. విచారణలో తేలిన ముఖ్యాంశాలు:

​పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండి 5 కేజీల గంజాయిని కొనుగోలు చేసి, గాజువాకకు చెందిన ఇద్దరు వ్యక్తులకు అక్రమంగా సరఫరా చేసినట్లు ఒప్పకున్నాడు.

​ఈ అక్రమ విక్రయం ద్వారా సుమారు రూ.43,000/- నగదు లావాదేవీలు జరిగినట్లు వెల్లడించాడు.నేర చరిత్ర:

పోలీసుల రికార్డుల ప్రకారం, నిందితుడిపై గతంలో కూడా నేర చరిత్ర ఉంది:

​గంజాయి కేసులు: 02

​చోరీ కేసులు: 02

నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేసి, గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించడం జరిగింది. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post