రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి శంకర్ రాజ్.
Palasa GRP రైల్వే పరిధిలో పలాస - పుండి రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 30-35 సంవత్సరాల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మగ వ్యక్తి గుర్తు తెలియని ఎగువకు వెళ్ళు రైలు బండి నుండి జారిపడి మరణించడం జరిగినది. మృతుడు ఎడమ చేతి చూపుడు వేళ్ళకి ఓటు వేసిన ఇంక్ పెట్టబడి ఉన్నది. నీలం రంగు ఫుల్ హాండ్స్ షర్టు, కాపీ రంగు గల ప్యాంటు కలదు. మృతదేహమును పలాస గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించడమైనది. మరిన్ని వివరాలకు పలాస GRP రైల్వే స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ A కోటేశ్వరరావు గారు 9247585743 నెంబర్ కు సంప్రదించవలెను.
