మార్కాపురం జిల్లా...బేస్తవారిపేటలో దారుణ హత్య.


 మార్కాపురం జిల్లా...బేస్తవారిపేటలో దారుణ హత్య.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా, బెస్తవారిపేట మండలంలోని దారుణ ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన సత్తాబి పెద్ద కుమారుడు రాజా హుస్సేన్, చిన్న కుమారుడు ఖాజావలి, కుటుంబానికి చెందిన రాజా హుస్సేన్ కుమార్తెను పొదలకుంట పల్లె గ్రామానికి చెందిన వలి అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు,

రాజా హుస్సేన్ అల్లుడు వలి గత కొన్ని రోజులుగా తన భార్యను వేధిస్తున్నట్లు సమాచారం. 

ఈ విషయంపై రాజా హుస్సేన్ పలుమార్లు అతనిని హెచ్చరించినప్పటికీ, వలి వారిపై కక్ష పెంచుకొని ఈ రోజు మధ్యాహ్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా, వెనుక గది ద్వారం నుండి ఇంట్లోకి ప్రవేశించిన వలి కత్తితో దాడి చేసిహత్య చేశాడు. అనంతరం అక్కడి నుండి పారిపోతుండగా రాజా హుస్సేన్ కనిపించడంతో అతని పైనా కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post