అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం మంజూరు చేయాలి - ఏపీ రైతు సంఘం.


 అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం మంజూరు చేయాలి - ఏపీ రైతు సంఘం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా బేస్తవారిపేట : అర్హులైన పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలం, సాగుభూమి మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం గిద్దలూరు నియోజకవర్గ కార్యదర్శి ఢాకాల పుల్లయ్య, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఊరుమార్పు జోషఫ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగుభూమి సాధనకై ఈ నెల 24న చేపట్టబోయే "రాష్ట్ర వ్యాప్త ఆందోళన" గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగింది. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక చర్యలు ఆపి, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు అమలు పరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఆర్ధిక సహాయం, టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు స్వాధీనం, భూమి లేని పేదలకు సాగు భూమిని పంపిణీ చేయాలని,

 అద్దె ఇంట్లో ఉండే పేదవారిని గుర్తించి ప్రభుత్వమే అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ఆందోళన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post