రేషన్ డిలర్లు సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి.


రేషన్ డిలర్లు సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి.

డి వెంకన్న ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి. మహేశ్వరరావు.

అనకాపల్లి మర్చి:04 దేవరపల్లి రేషన్ డిలర్లు సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న డిమాండ్ చేసారు బుధవారం అయిన ఓప్రకటన విడుదల చేసిన అనంతరం మాట్లాడారు,ఒకప్పుడు రేషన్ డీలర్ అంటే సమాజంలో ఒక ప్రత్యేక మైన గుర్తింపు ఉండేదని.ఆర్థిక ఇబ్బందులు లేకుండా సొంత ఊరిలోనే ఉపాధిని పొందుతూ దర్జాగా జీవించే పరిస్థితులు ఉండేవని. ఒక గౌరవ ప్రదమైన సేవగాను భావించేవారని తెలిపారు గతంలో రేషన్ డీలర్లను స్థానిక ప్రజా ప్రతినిధులతో సమానంగా ప్రజలు గౌరవించే వారని తెలిపారు.ఇది ఒకప్పటి మాట అయితే ప్రస్తుతం వీటన్నింటికీ భిన్నంగా రేషన్ డీలర్ల బతుకులు ఆగమ్యగోచరంగా మారాయని అన్నారు. గతానికి భిన్నంగా రేషన్ డీలర్ల పరిస్థితి విగ్రహం పుష్టి నైవేద్యం నాస్తి అన్న చందంగా నేడు మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.సొంత ఊరిలోనే ఉంటూ, కుటుంబ మంతా సంతోషంగా జీవించిన రేషన్ డీలర్లు బతుకులు ప్రస్తుతం చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.జీరో ఆదాయంతో బతుకు జీవుడా అంటూ రేషన్ డీలర్ షిప్లను వదులు కోలేక మరో పని చేసు కోలేక ఊసురోమంటూ బతుకు తున్నారని తెలిపారు 10 ఏళ్ల క్రితం వరకు గౌరవ ప్రదంగా జీవించిన రేషన్ డీలర్లును ప్రభుత్వాలు ఒక దొంగలాగ ప్రజల్లో చూపించిందని తెలిపారు ప్రభుత్వం రేషన్ డీలర్లతో వెట్టి చాకిరీ చేయించు కుంటు ఆదాయ మార్గాలను చూపించ కుండా డీలర్లు కమిషన్ తో పని లేకుండా గౌరవ వేతనం చెల్లించాలని గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పౌరసరఫరాల వ్యవస్థ ప్రక్షాళన పేరుతో డీలర్లు ఆదాయ మార్గాలను నియంత్రించి, రేషన్ డీలర్లను దొంగలాగా చూపిస్తున్నారని తెలిపారు. పౌర సరఫరాల వ్యవస్థలో అసలు దొంగలు ఎవరో ప్రభుత్వాలకు తెలియదా అని ప్రశ్నించారు, కొన్ని దశాబ్దాలుగా రేషన్ షాపులను నమ్ము కుని బతుకుతున్న డీలర్ల బతుకులు గురించి,వారి ఆర్థిక పరిస్థితుల గురించి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అన్యాయ మన్నారు డీలర్ షిప్లను వదులు కోలేక ఆదాయం లేక అప్పులు చేసుకొని బతుకుతున్నారని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇంటింటా రేషన్ సరఫరా వల్ల రేషన్ డీలర్లకు పని, ఆదాయము రెండు లెకుండా పోయాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వస్తే మా తలరాతలు మారుతాయని అని రేషన్ డీలర్లు ఎంతో ఆశపడ్డారని తెలిపారు.కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎండియు వ్యవస్థను రద్దు చేయడంతో గత వైభవం తిరిగి లభిస్తుందని రేషన్ డీలర్లంతా ఎంతో ఆశపడి సీఎం చంద్రబాబు చిత్ర పటానికి అభిషేకాలు కూడా చేశారని అయిన వారి ఆశలు అడి యాశలుగా మిగిలాయని తెలిపారు ఎండియు వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రేషన్ డీలర్లకు సరుకులు సరఫరా బాధ్యతలను అప్పగించిందే తప్ప ఆదాయాన్ని పెంచ లేదన్నారు.ఎండియు వ్యవస్థ ఉండే టప్పుడు పని లేకపోయినా కొద్దిపాటి ఆదాయమైన వచ్చేదని ప్రస్తుతం సొంత ఖర్చులతో సహాయకునికి జీతం ఇచ్చుకుంటూ సరుకులను ప్రజలకు అందిజేస్తూ పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు గతంలో పౌరసర ఫరాల శాఖ ద్వారా రేషన్ బియ్యం, కిరోసన్, పంచదార ఇతర నిత్యావసర వస్తువులను డీలర్లు ప్రజలకు పంపిణీ చేసేవారని ప్రస్తుతం రేషన్ డిపోల్లో కేవలం బియ్యం, పంచదార మినహా మిగిలిన ఏ సరుకులు సరఫరా చేయడం లేదని అన్నారు. వివిధ రకాల సరుకులు సరఫరా చేసినందుకు రేషన్ డీలర్లకు పౌరసరఫరాల శాఖ నుండి కమిషన్ ద్వారా ఆదాయం లభించేదని.రేషన్ సరఫరాలో అవి నీతిని నియంత్రించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను డీలర్లు అందరూ స్వాగతి స్తున్నారని, అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేలకు పైగా రేషన్ డీలర్ల బతుకులకు కనీస ఆదాయ మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వ తీసు కోవాలని వెంకన్న డిమాండ్ చేసారు.

 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post