మార్కాపురం జిల్లా కనిగిరి సబ్ - డివిజన్లోని కనిగిరి సర్కిల్ కార్యాలయం మరియు పోలీసు స్టేషన్లను తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా ఎస్పీ.
నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
సాంకేతిక టెక్నాలజీ పై అవగాహన పెంచుకుంటూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.
అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలి.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదారులకు భరోసా కలిగేలా విధులు ఉండాలి: జిల్లా ఎస్పీ
సాధారణ తనిఖీల్లో భాగంగా కనిగిరి, హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్‌లను మరియు కనిగిరి సర్కిల్ కార్యాలయమును బుధవారం జిల్లా ఎస్పీ గారు సందర్శించి, స్టేషన్ స్థితిగతులు మరియు సిబ్బంది పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణంతో పాటు మహిళా సహాయక కేంద్రం, రిసెప్షన్ కౌంటర్ స్టేషన్ ల పరిసరాలను పరిశీలించారు. అలాగే స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, సీడీ ఫైల్స్ సహా పలు రికార్డులను తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ, నేర నివారణకు చేపడుతున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అలాగే పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులను పరిశీలించి, వాటి దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి ఫిర్యాదుదారులకు త్వరిత పరిష్కారం అందించాలని ఆదేశించారు.
ప్రతి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీ.డి. ఫైల్‌లో సక్రమంగా నమోదు చేసి దర్యాప్తు ప్రక్రియ సజావుగా సాగేలా, దర్యాప్తు నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త చట్టాలప్రకారం రిజిస్టర్ లను కూడా కొత్త ప్రోపార్మా ప్రకారం జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.
బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి అవసరమైన తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు.
అలాగే ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగ మద్యపానాన్ని నియంత్రించడం ద్వారా నేరాల శాతం గణనీయంగా తగ్గుతుందన్నారు.
రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతూ నిరంతరం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను, జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బారికేడ్స్, రేడియం స్టిక్కర్స్ తో కూడిన డ్రమ్ములు ఏర్పాటుచేయాలని, వివిధ శాఖల సమన్వయముతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలి. రోడ్డు మరియు ట్రాఫిక్ భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు నివారణకు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలని, ఎన్ఫోర్స్మెంట్ ను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.
కేసుల దర్యాప్తులో సిబ్బందిని కూడా భాగస్వాములను చేసి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే పాత నేరస్థులు, చెడు నడతకలిగిన మరియు అనుమానితులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి జీవన విధానం తదితర విషయాలను తెలుసుకోవాలని,వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.
ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించేలా పలు సూచనలు చేశారు. అలాగే ప్రతిరోజు పై అధికారుల నుంచి వచ్చే ఆదేశాలను క్రింది స్థాయి సిబ్బందికి సమర్థంగా తెలియజేయాలని, ఆదేశాలకు అనుగుణంగా సిబ్బంది విధులు నిర్వర్తించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
మహిళాలు, పిల్లలు భద్రతాకు శక్తి టీములు సమర్ధవంతంగా విధులు నిర్వహించే విధంగా మరియు సైబర్ నేరాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలన్నారు.
విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి రోజు గ్రామా/వార్డులకు వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలన్నారు.
ఆయా ప్రదేశాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివిధ కేసులలో సిజ్ చేసిన వాహనాలను కోర్టు అనుమతి తీసుకుని వాటిని డిస్ఫోజ్ చేయాలని సిబ్బందికి ఆదేశించారు.

