మహిళా సాధికారతకు ఆత్మరక్షణే తొలిమెట్టు - సీఐ అప్పలరాజు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి మార్చి:04
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్బంగా, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థినులకు "ఆత్మరక్షణ మెలుకువలు" (Self-Defence Training) పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
భాగంగా చోడవరం బాలికల ఉన్నత పాఠశాలలో చోడవరం సీఐ అప్పలరాజు ఆదేశాలు మేరకు
పోలీస్ అధికారులు, మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో కలిసి విద్యార్థినులకు ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించి, అత్యవసర పరిస్థితుల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించారు.
ఈ సందర్భంగా ఎస్సై నాగకార్తీక్ మాట్లాడుతూ మహిళల భద్రత కేవలం చట్టాల ద్వారానే కాకుండా, వారిలో పెరిగే ఆత్మవిశ్వాసం ద్వారా కూడా సాధ్యమవుతుంది. ప్రతి విద్యార్థిని చిన్నతనం నుంచే ఆత్మరక్షణ మెలుకువలను నేర్చుకోవాలి. ఆపద సమయంలో భయం వీడి, ధైర్యంతో ఎదురుదాడి చేయడం ద్వారా తమను తాము రక్షించుకోవచ్చు. జిల్లా పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తుంది. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థినుల్లో ధైర్యాన్ని నింపుతాయని
మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో విద్యార్థినులకు లైవ్ డెమోనిస్ట్రేషన్.
అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు డయల్ 100/112' వినియోగంపై అవగాహన.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఎస్సై నాగకార్తీక్ తెలిపారు

