గంజాయి కేసులో 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయలు జరిమానా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి (చోడవరం), మార్చి:09 జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, స్పష్టం చేశారు. గత 2016లో చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 148 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు నేడు కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
చోడవరంలోని 9వ అదనపు జిల్లా కోర్టు గౌరవనీయ జడ్జి ఎం.హరినారాయణ ఈ కేసులో నిందితులైన వంతల జయరాం మరియు గొల్లూరి భీమరాజు లపై మోపబడిన నేరం (NDPS Act) నిరూపితం కావడంతో ఈ క్రింది శిక్షలను ఖరారు చేశారు:
నిందితులు ఇరువురికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష.
ఒక్కొక్కరికి
రూ.1,00,000/- జరిమానా.
జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో 2 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష.
గత 2016 సెప్టెంబర్ 2వ తేదీన, గౌరపట్నం గ్రామ సమీపంలో 148 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితులను అప్పటి చోడవరం ఎస్సైపి.నరసింహమూర్తి మరియు సిబ్బంది పట్టుకున్నారు. నిందితులపై పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎస్సైని మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే, ఈ కేసులో రీజినల్ ఎగ్జామినేషన్ లాబొరేటరీ (REL) ఫోరెన్సిక్ రిపోర్టులను మరియు ఇతర కీలక సాక్ష్యాధారాలను కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టి, నిందితులకు శిక్ష పడేలా వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణని, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందిని మరియు చోడవరం పోలీసులను ఎస్పీ ప్రశంసించారు.
"మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలతో నిందితులకు శిక్షలు పడేలా చేయడం ద్వారా నేరస్థుల్లో భయాన్ని కలిగిస్తున్నాము. యువత భవిష్యత్తుతో ఆడుకునే గంజాయి స్మగ్లర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టము,అని ఎస్పీ తుహిన్ సిన్హా,హెచ్చరించారు
