డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను అకస్మికతనికి చేసిన ఎంఈఓ 2.


 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను అకస్మికతనికి చేసిన ఎంఈఓ 2.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం.జిల్లా కంభం :

పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధన లక్ష్యంగా విద్యార్థులు నిరంతర కృషి చేయాలని ఎంఈఓ-2 శ్రీనివాసులు అన్నారు.స్థానిక బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సోమవారం ఎంఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

10వ తరగతి విద్యార్థుల గ్రాండ్ టెస్ట్,9వ తరగతి విద్యార్థుల సమ్మేటివ్ పరీక్షలను పరిశీలించారు.అనంతరం సూరేపల్లి ప్రాథమిక పాఠశాలలో జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, మధ్యాహ్న భోజనాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. 

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రణాళికలు పూర్తయ్య నాటికి విద్యార్థులందరినీ స్కై లెవెల్లో ఉండేలా చూడాలనీ, భాషా నైపుణ్యాలు,గణిత సామర్థ్యాలలో ఖచ్చితమైన ఫలితాలను సాధించేలా కృషి చేయాలని సూచించారు.75 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గడచిన 63 రోజుల ప్రగతిని సమీక్షించారు. కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్,ఉపాధ్యాయుడు అంకయ్య ఉన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post