మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష.


 మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష.

ఏలూరు పోక్సో కోర్టు చిన్నారులపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు తప్పవని మరోసారి స్పష్టం చేసింది.

ఆర్‌ఎంపీ డాక్టర్ యల్లా రత్న ప్రసాద్ (బాబా డాక్టర్) ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

     ఏలూరుజిల్లా....ఏలూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ యల్లా రత్న ప్రసాద్ (బాబా డాక్టర్) ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో గౌరవ ఏలూరు పోక్సో కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే ₹10,000 జరిమానా విధించారు.

      ఈ ఘటన 07.04.2025 సాయంత్రం 4 గంటలకు వెంకటాపురం రామానగర్ కాలనీలో జరిగింది. ఆ సమయంలో 3వ తరగతి చదువుతున్న బాలికను నిందితుడు తన క్లినిక్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

      బాలిక కేకలు వేయడంతో స్థానికులు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక మేనత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

     కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, శాస్త్రీయ ఆధారాలతో కోర్టులో పక్కా చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

    విచారణ అనంతరం గౌరవ పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ, బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున ₹2,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

    కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, దర్యాప్తు అధికారులు మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post