నగరాన్ని క్లీన్ సిటిగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్.


నగరాన్ని క్లీన్ సిటిగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా శనివారం ఒంగోలు నగరంలోని డిఆర్ఆర్ఎం హై స్కూల్ ఆవరణలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఒంగోలు నగరాన్ని క్లీన్ సిటిగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు ఆత్మ గౌరవంతో జీవనం సాగించవచ్చన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్చత మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల్లో శుభ్రత గురించి అవగాహన కల్పించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యమన్నారు. 

ఒక వ్యక్తి పరిశుభ్రంగా ఉంటే వారి కుటుంబం పరిశుభ్రంగా ఉంటుందని, తద్వారా సమాజమంతా పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.  

విద్యార్ధి దశనుండే పరిసరాలపరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ , విద్యార్ధులకు సూచించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు కలిగిస్తాయని, తడి, పొడి చెత్తలను వేరు చేసి డస్ట్ బిన్స్ లో వేయాలని తెలిపారు. వీధులు పరిశుభ్రంగా ఉండేలా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఈ విషయంలో సామూహికంగా కృషి చేయాలన్నారు. తడి, పొడి, పారిశుద్ధ్య వ్యర్ధాలను వేరుచేయడమే స్వచ్ఛతకు తొలి అడగని, వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు పై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా స్వర్ణ ఆంద్ర స్వచ్చ ఆంద్ర ప్రతిజ్ఞ చేయించారు. వేసవి కాలం నేపధ్యంలో పక్షులకు తాగునీరు అందించేలా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఉట్టేలను జిల్లా కలెక్టర్ ప్రారంభించి వాటిలో నీటిని పోయడం జరిగింది. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటడం జరిగింది. స్వచ్ఛత పై 9వ తరగతి విదార్ధులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు, జిల్లా కలెక్టర్ బహుమతులు ప్రదానం చేసారు. 

ఈ కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ కమీషనర్.వెంకటేశ్వర రావు, ఐటిసి డబ్ల్యూ.ఓ.డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు, పాఠశాల విద్యార్ధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post