గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తూ చోడవరం జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పు.


గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తూ చోడవరం జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి(చోడవరం)మార్చి:20 అనకాపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం గంజాయి మాఫియాపై సాగిస్తున్న పోరాటంలో మరో కీలక విజయం నమోదైంది. 2015లో చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన భారీ గంజాయి రవాణా కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ విభాగం విజయం సాధించాయి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ కేసు వివరాలను వెల్లడించారు.

​చోడవరంలోని తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎం.హరి నారాయణ ఈ కేసులో కీలక తీర్పును వెల్లడించారు. 

నిందితుడు (A1) కోరుకొండ అప్పల పాత్రుడు @ రాజు (32 ఏళ్లు, విజయనగరం జిల్లా) నేరానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాల ద్వారా నిరూపితమైంది. ఈ మేరకు గౌరవ జడ్జి గారు నిందితుడికి: ​10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,

​రూ.1,00,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

​జరిమానా చెల్లించని యెడల అదనంగా మరో 2 ఏళ్ల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.​16.07.2015 న చోడవరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వద్ద అప్పటి సబ్-ఇన్‌స్పెక్టర్ బి.రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో లారీ మరియు మోటార్ సైకిల్ పై తరలిస్తున్న 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులపై NDPS చట్టం కింద కేసు (Crime No. 102/2015) నమోదు చేశారు. పరారీలో ఉన్న రెండో నిందితుడు (A2) కిల్లో బాబురావు పై NBW పెండింగ్‌లో ఉన్నందున, అతని కేసును వేరు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

​ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణని, కోర్టు విచారణలో కీలక పాత్ర పోషించిన కోర్ట్ మానిటరింగ్ సెల్ సిబ్బందిని మరియు అప్పటి దర్యాప్తు అధికారి సహా చోడవరం పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.

​నిందితులకు శిక్ష పడేలా చేయడంలో పోలీసుల అంకితభావం మరియు న్యాయ విభాగంతో సమన్వయం ఎంతో గొప్పదని ఎస్పీ కొనియాడారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని వారు హెచ్చరించారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post