సిబ్బంది సంక్షేమమే మా ధ్యేయం: విజయవంతంగా కొనసాగుతున్న ‘SP-SAMPARK’.


 సిబ్బంది సంక్షేమమే మా ధ్యేయం: విజయవంతంగా కొనసాగుతున్న ‘SP-SAMPARK’.

నేరుగా జిల్లా ఎస్పీతో మాట్లాడిన సిబ్బంది.

​సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, మార్చి :20 

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన ‘SP-SAMPARK’ ఫోన్-ఇన్ కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, స్వయంగా ఫోన్ లైన్ ద్వారా సిబ్బంది సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు.

​నాయకత్వానికి మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, సిబ్బంది తమ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఇబ్బందులను ఎటువంటి సంకోచం లేకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ఈ ‘SP-SAMPARK’ వేదికను రూపొందించడం జరిగింది.

​జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్ నంబర్ 93469 12011 ద్వారా ఎస్పీతో మాట్లాడారు. సిబ్బంది ప్రధానంగా సర్వీస్ పరమైన పోస్టింగ్స్, బదిలీలు, సెలవులు మరియు కుటుంబ ఆరోగ్య సమస్యలను వివరించారు. ప్రతి సమస్యను లోతుగా విశ్లేషించిన ఎస్పీ. వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.

"పోలీస్ సిబ్బంది సమస్యను పరిష్కరించడమే మా ప్రాధాన్యత. దూర ప్రాంతాల నుండి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సిబ్బంది తమ సమస్యలను నేరుగా నాతో పంచుకోవచ్చు. ప్రతి సమస్యను గోప్యంగా ఉంచుతూ త్వరితగతిన పరిష్కారం చూపుతాం."

తుహిన్ సిన్హా , జిల్లా ఎస్పీ.​ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతి ఫిర్యాదును డిజిటల్ రిజిస్టర్‌లో నమోదు చేసి, పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడం జరుగుతుంది.

​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, ఎస్సై ప్రసాద్, ఆఫీస్ సూపరింటెండెంట్ గిరి మరియు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post