రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సీఐ


 రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సీఐ                         

మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై 

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు 

రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కంభం పట్టణము లోని 15 మసీదుల ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పండుగ వేళ ప్రజలు శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలని, ఎలాంటి అపోహలు, వివాదాలు తలెత్తకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. మత పెద్దలు కూడా పోలీసులకు సహకరిస్తూ సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొల్పేందుకు కృషి చేయాలని అధికారులు కోరారు.

పండుగ రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలందరూ శాంతి, సహనం పాటిస్తూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు.అనంతరం ఎన్ ఆర్ ఐ,సయ్యద్ రఫీ,సి ఐ గారికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి సన్మానము చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post