బ్రహ్మోత్సవాలను పకడ్బందీగానిర్వహించాలి.జెసిశ్రీనివాసులు.


 బ్రహ్మోత్సవాలను పకడ్బందీగానిర్వహించాలి.జెసిశ్రీనివాసులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా రాచర్ల జేపీ చెరువు అడవిలో వెలసిన ప్రముఖ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. 

సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఏప్రిల్ 2 నుంచి 5 వ తేది వరకు నిర్వహించనున్న ఈ బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నీటి వసతి, షామియానాలు, విద్యుత్, వాహనాల సౌకర్యం ఇలా ఎలాంటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. 

పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, అదేవిధంగా రోడ్ల గుంతలను పూడ్చాలని తెలిపారు. ముఖ్యంగా తెప్పోత్సవం జరిగే గుండం దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లైఫ్ జాకెట్లను సిద్ధం చేసీ, చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా అటవీ మార్గంలో ఎలాంటి వాహనాల రద్దీ లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, డిఎంహెచ్వో వాణిశ్రీ, డీఎఫ్ఓ నిషా కుమారి, ఆలయ ఈవో నాగయ్య, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post