గిద్దలూరు నియోజకవర్గానికి రూ.5.60 కోట్ల ఆర్ & బీ రోడ్ల మంజూరు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటుందని ఎమ్మెల్యే శ్ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు.
శాసన సభ్యులు మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వo దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆర్ & బీ రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.5.60 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఈ నిధులతో గిద్దలూరు నియోజకవర్గం లోని పాడైన రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు ప్రజల అవసరాలు అభివృద్ధి కార్యక్రమాలపై కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని శాసనసభ్యులు అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.
గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని శాసనస భ్యులు హామీ ఇచ్చారు.
