బెస్తవారిపేట మండలంలో ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు.



 బెస్తవారిపేట మండలంలో ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి అందులో భాగంగా మన బేస్తవారిపేట మండలంలో మూడు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది . 

బెస్తవారిపేటలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 220 మంది విద్యార్థులు మరియు జిల్లా పరిషత్తు బాలుర పాఠశాల నందు 193 మంది మరియు జిల్లా పరిషత్ పిటకాయగుల్ల పాఠశాల నందు 145 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు ఈ పరీక్షల సందర్భంగా ఏ విద్యార్థి క్రింద కూర్చుని అసౌకర్యాన్ని గురికాకుండా పరీక్షలు రాయడానికి అందరి కోసం బల్లలను ఏర్పాటు చేశామని వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరికీ త్రాగునీటి వసతి ఏర్పాటు చేయడం జరిగిందని 

ఈ వేసవికాలం సందర్భంగా ఎవరైనా విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే వారికి చికిత్స అందించడానికి ఏఎన్ఎంలు కావలసిన మందులతో అందుబాటులో ఉంటారని తెలియజేశారు,

విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండవద్దని విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని వారు తెలియజేశారు. 

ఈ విద్యా సంవత్సరంలో పిల్లలందరూ స్కూల్లో యందు బాగా చదివారని ఈ సంవత్సరం మంచి ఉత్తీర్ణత తీసుకొని వస్తారని తెలియజేశారు,

 అలాగే బెస్తవారిపేట మండల రెవెన్యూ అధికారి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసి పోలీసు వారి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని బెస్తవారిపేట మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ రెడ్డి తెలియజేశారు,

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post