పోక్సో కేసులో నిందితుడుకి 20 సంవత్సరాలు జైలు శిక్ష,


పోక్సో కేసులో నిందితుడుకి 20 సంవత్సరాలు జైలు శిక్ష,

 రూ.10,000 వేలు జరిమానా విధించిన ఒంగోలు POCSO కోర్ట్ జడ్జీ, 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

పిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు: మార్కాపురం జిల్లా ఎస్పీ.వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

పోక్సో కేసులో నిందితుడు శిక్షింపబడుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.

10 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి సోమవారం గౌరవ POCSO కోర్టు జడ్జీ శ్రీ కె.శైలజ గారు నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.10,000 జరిమానా బాధితురాలకు మూడు లక్షల రూపాయలు పరిహారం ప్రకటించిన POCSO కోర్ట్ జడ్జీ,

ముద్దాయి పేరు మోతుకూరి @ కోలా పిచ్చయ్య S/O డేవిడ్ (31 సం") పూసలపాడు గ్రామం, బివి పేట మండలము, మార్కాపురం జిల్లా.

బేస్తవారిపేట మండలం, పూసలపాడు గ్రామానికి చెందిన మోతుకూరి @ కోలా పిచ్చయ్య 31సంవత్సరాలు అనే వ్యక్తి, తేదీ 14.04.2024 సంవత్సరము లో ఉదయం 07.30 గంటల సమయంలో బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి తన ఇంటికి వస్తుండగా ముద్దాయి మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటి లోపలకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసినాడు. తర్వాత బాలిక ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పగా వారు వెళ్లి B .V పేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి SI B.నరసింహారావు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును అప్పటి మార్కాపురం SDPO బాలసుందరావు.

కేసును అప్పగించగా మార్కాపురం DSP దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. అనంతరం కోర్టులో ఛార్జి షీట్ దాఖలు చేయటం జరిగింది.

పోలీసులు సమయానుసారం సాక్షులను కోర్ట్ నందు హాజరు పరుచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాదారాలతో నిందితుడుపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో 16.03.2026న ఒంగోలులోని POCSO కోర్ట్ జడ్జి కె.శైలజ నిందితుడుకి.20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.10,000/- వేల రూపాయలు జరిమానా,భాధితురాలకు మూడు లక్షల రూపాయలు పరిహారమును ఒంగోలు DLSA ద్వారా అందచేయవలసిందిగా ప్రకటించారు.

అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులకు ఇటువంటి తీర్పులు గుణపాఠంగా నిలవాలని, బాలికలు ధైర్యంగా ఉండాలని ఏదైనా సమస్య వచ్చిన తల్లిదండ్రులకు చెప్పాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. చిన్న పిల్లలు పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ అన్నారు.

పై కేసులో ముద్దాయికి శిక్ష పడటంలో కృషిచేసిన పోలీస్ అధికారులను మరియు కోర్ట్ లైజన్ ASI E.V స్వామి, కానిస్టేబుల్ యల్లమంద, B.V పేట హోంగార్డ్ D.దస్తగిరి 269, M.వెంకటేశ్వర్లు PC 975, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు గారిని జిల్లా ఎస్పీ అభినందించారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post