క్రైమ్ 9మీడియా ప్రతినిధి.జోనల్ ఇంచార్జి పి మహేశ్వరరావు.
అనకాపల్లి ఫిబ్రవరి:05.మాడుగుల మండలంలో మంగళవారం రాత్రి జంపెన గ్రామానికి చెందిన ధర్మిశెట్టి అచ్యుతారావు 45 సం. అతను రాత్రి భోజనం చేసి అతని పశువుల పాక దగ్గరకు వెళ్ళి పడుకొనే ముందు పశువుల కోసం దానా వండి మంటను పూర్తిగా ఆర్పకుండా పడుకోవడం వల్ల ప్రమాదవశాత్తు పాకకు మంట అంటుకొని పాకలో ఉన్న పశువులకు, మృతుడికి మంటలు అంటుకోవడంతో విశాఖ కేజిహెచ్ కు తరిలించారు అనంతరం చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్టు మృతుని భార్య దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని మాడుగుల ఎస్సై నారాయణాయరావు తెలిపారు.

