ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.



 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి.

ఏలూరు ఎమ్మెల్యే తో కలిసి జిల్లా ఎస్సీ, ఎస్టీ లపై దాడుల నిరోధక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

 క్రైమ్ 9మీడియా (ప్రతినిధి) సన్నీ చక్రవర్తి.

           ఏలూరు, ఫిబ్రవరి, 5 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా ఎస్సీ, ఎస్టీ లపై దాడుల నిరోధక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లాలో కేసుల పరిష్కారంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), కమిటీ సభ్యులు నల్లమల్లి శంకర్, తాళ్లూరి రాణి, కుంటం రాంబాబు, సాయం ముక్కయ్య లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 2025 జనవరి నుండి 2026, జనవరి, 31 వతేదీ వరకు మొత్తం 59 కేసులు నమోదయ్యాయని, వీటిలో 37 కేసులకు సంబంధించి విచారణ దశలో ఉన్నాయన్నారు. వీరిలో 56 మంది బాధితులకు ఎఫ్ ఐ ఆర్ స్థాయిలో 63. 25 లక్షల రూపాయలు, చార్జ్ షీట్ దశలో 31 మందికి 68. 50 లక్షల రూపాయలు పరిహారం అందించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో భాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కేసుల ధర్యాప్తు త్వరితగతిన పూర్తిచేసి నిర్ధేశించిన సమయంలోపు చార్జిషీటు ధాఖలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా అట్రాసిటీ కేసుల పురోగతిపై డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. దర్యాప్తులో పూర్తి ఆధారాలు సేకరించి సకాలంలో ఛార్జిషీటు ఫైల్ చేయాలన్నారు. తప్పనిసరిగా ఒకసారి జిల్లాస్ధాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశం నిర్దేశించిన సమయానికి నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడంతోపాటు ప్రజల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావాలన్నారు.  

          ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్, తెగల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. వారి సంక్షేమానికి ఎన్నో పధకాలను అమలు చేస్తున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు సత్వర పరిష్కారానికి, బాధితులకు నిబంధనల ప్రకారం పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమానికి కృషిచేసేవారిని కమిటీ లో సభ్యులుగా నియమయించడం జరిగిందని, సభ్యులు షెడ్యూల్డ్ కులాలు, తెగల సమస్యలు తెలుసుకుని వారి సంక్షేమానికి కృషిచేయాలన్నారు.       

           సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఐటిడిఏ పీఓ రాములు నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ముక్కంటి, సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డిఎస్పీ లు శ్రావణ్ కుమార్, వెంకటేశ్వరరావు, ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post