జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండూరు దేముడు ప్రమాణ స్వీకారం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జోనల్పిఇంచార్జి. మహేశ్వరరావు.
అనకాపల్లి ఫిబ్రవరి:05.అనకాపల్లి జిల్లా పార్టీ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనకాపల్లి పెంటకోట కళ్యాణ మండపం వద్ద మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు అధ్యక్షతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజవర్గానికి మాడుగుల మండలం పొంగలిపాక గ్రామం కింతల పిఎసిఎస్ చైర్ పర్సన్ ఉండూరు దేముడుకి జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ పటిష్టత కోసం కమిటీ సభ్యులు అందరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి దాడి వీరభద్ర రావు ఎమ్మెల్సీ చిరంజీవి మాస్టారు, రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిసి కుమార్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గండి బాబ్జి, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు మాజి ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ , ఎక్స్ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, దాడి రత్నాకరు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల అప్పలరాజు, పెద్దిరు జలాశై చైర్మన్ అద్దిపల్లి జగ్గారావు , మండల పార్టీ అధ్యక్షులు నందారపు సన్యాసిరావు పుప్పాల రమేష్, క్లస్టర్ ఇన్చార్జిలు బీసెటి విజయలక్ష్మి, మజ్జి లక్ష్మీరావు, వడ్డీ రాజ్ కుమార్, పొంగలిపాక ఎంపీటీసీ మై చర్ల సన్యాసిరావు, సర్పంచు నాయన సత్యనారాయణ, మజ్జి బాబ్జి, సచ్చివరం సర్పంచ్ సూర్యనారాయణ, వమ్మలి సర్పంచ్ నాయుడు, ఎన్నంశెట్టి సత్తిబాబు సంతోష్, సాగరం ఎక్స్ సర్పంచ్ బుద్ధల రమణ, పొంగలిపాక గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరైయున్నారు.
