ఒంటరి మహిళపై అత్యాచారం చేయబొయి హత్య చేసిన నిందితుడు అరెస్ట్.
మీడియా సమావేశంలో కేసులో సంచలన విషాయాలు వెల్లడించిన కనిగిరి డిఎస్పి సాయిఈశ్వర్.
ముద్దాయికి పలువురు మహిళలతో అక్రమ సంబందం.
మహిళలను చంపి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డా నిందితుడు.
ఎట్టకేలకు విఆర్వొముందు లొంగిపొయిన నిందితుడు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా పొదిలి మండలం గొగినేనివారి పాలెం గ్రామంలో ఒంటిరి మహిళను హత్య చేసి ఆధారాలు దొరక్కుండా దాదాపు రెండు నెలలనుంచి తప్పించుకోని తిరుగుతు పొలీసులు దర్యాప్తు ముమ్మరం కావడంతో ఎట్టకేలకు నిందితుడు ఎం.ఏడుకొండలు విఆర్వో ముందు లొంగిపొయ్యాడు.నిందితుడు పలువురు మహిళలతో ఆక్రమ సంబంధం కొనసాగిస్తు ఒంటరి మహిళైన పులిబుల్లెమ్మ పై కన్నేసి ఆమె ఒప్పుకొక పొవడంతో ఆమెను తాడుతో గొంతుబిగించి అతి దారుణంగా చంపాడని డీఎస్పీ తెలిపారు..కేసు నమోదు చేసుకొన్న పొలీసులు అన్ని కొణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఎట్టకేలకు పొలీసులు పట్టుకుంటారని గ్రహించిన నిందితుడు విఆర్వోఓ ముందు లొంగిపొయ్యాడు.
ఈ కేసులో కిలకంగా వ్యవహరించి నిందితున్ని కనిపెట్టిన పొదిలి కానిస్టేబుల్స్ షాకిర్,కొటిని డిఎస్పి అభినందించారు.
ఈ సమావేశంలో పొదిలి సి.ఐ రాజేష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
