కె.జె. పురం గ్రామంలో లేగ దూడల ప్రదర్శన విజయవంతం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి. మహేశ్వరరావు.
అనకాపల్లి ఫిబ్రవరి:06
మాడుగుల (మండలం)మేజర్ పంచాయతీ కె. జె.పురం గ్రామంలో ఈరోజు లేగ దూడల ప్రదర్శన కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన పాడి రైతులు తమ వద్ద ఉన్న సంవత్సరం లోపు వయసు ఉన్న జెర్సీ , హెచ్.ఎఫ్ ,ఒంగోలు ,గిర్ మరియు ముర్రా గేదె జాతి లేగ దూడలను మొత్తం 47 దూడలను ఈ ప్రదర్శనకు తీసుకుని వచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు సర్పంచ్ జామి రమణ బాబు, ఏం.పి.టి.సి బీశెట్టి విజయ లక్ష్మీ, వైస్ ప్రెసిడెంట్ , పాల సంగం అద్యక్షులు ఎల్లపు శ్రీను మరియు కూటమి నాయకులు, మాడుగుల ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు, జిల్లా పశు గణాభివృద్ది కార్యాలయం నుంచి డా. సౌజన్య హాజరయ్యి పాడి రైతులకు పలు సూచనలు చేశారు.
ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన రాపేటి మహాలక్ష్మమ్మ కు చెందిన ఒంగోలు జాతి పెయ్యకు మొదటి బహుమతి,రేగాడ సూరి అప్పారావుకు చెందిన క్రాస్ బ్రీడ్ జెర్సీ పెయ్యకు రెండవ బహుమతి,భీశెట్టి అప్పారావు కు చెందిన ముర్రా జాతి పెయ్యకు మూడవ బహుమతి ప్రధానం సర్పంచ్ జామి రమణ బాబు, ఏం.పి.టి.సి బీశెట్టి విజయ లక్ష్మీ శ్రీనివాస్ , వైస్ ప్రెసిడెంట్ గోవింద, పాల సంఘం అద్యక్షులు ఎల్లపు శ్రీను మరియు కూటమి నాయకులు ప్రసాద్, హరి బాల గార్ల చేతుల మీదుగా చేశారు.
ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డా. శివ కుమార్, డా. గణేష్, ఎల్.యస్.ఎ వర్మ, పశు వైద్య సహాయకులు కన్నం నాయుడు, వరలక్ష్మి, మణికంఠ, గోవింద్, రాము, అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

