అంధుల క్రికెట్ పోటీల్లో ఏపీ జట్టు ఘన విజయం.
క్రై మ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు జిల్లా..ఏలూరు ఆశ్రమం మైదానంలో నిర్వహించిన అంధుల క్రికెట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అంధుల క్రికెట్ జట్టు ఘనవిజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఏపీ జట్టు విజేతగా నిలిచింది.
ఈ సందర్భంగా విజేతలైన ఏపీ జట్టుకు ఏలూరు జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ నారా శేషు ట్రోఫీని అందజేసి అభినందించారు. అంధుల క్రీడాకారుల ప్రతిభ, పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఇటువంటి క్రీడా పోటీలు దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి అజీజ్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసరాజు తదితర ప్రముఖులు పాల్గొని విజేతలను అభినందించారు. నిర్వాహకులు పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకు అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు.




