పాకాల బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలి.



 పాకాల బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలి.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లాలో ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్ లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విజయవంతంగా నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్.పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు. 

మంగళవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలోజిల్లా కలెక్టర్.రాజాబాబు, జిల్లా అధికారులతో సమావేశమై ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహణలో భాగంగా శాఖల వారీగా చేపట్టవలసిన ఏర్పాట్లపై సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేసారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహణపైకు సంబంధించి నోడల్ అధికారిగా జిల్లా పరిషత్ సిఈఓ ను నియమించడం జరిగిందన్నారు.  

 పాకల బీచ్ ప్రాముఖ్యత జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంత ప్రజలకు తెలిసేలా పాకల బీచ్ ఫెస్టివల్ ను విజవంతంగా నిర్వహించేలా ఏ శాఖకు కేటాయించిన విధులను ఆ శాఖ అధికారులు సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్ కు వచ్చే సందర్శకుల ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యంగా పారిశుధ్య , మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి వసతి, పార్కింగ్ ఏర్పాట్లు పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.   

బీచ్ ఫెస్టివల్ సందర్భంగా సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా వివిధ రకాల సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, హెలికాప్టర్ రైడింగ్, లేజర్ షోతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను, ఫుడ్ కోర్టులను నిర్వహిస్తున్నందున సంబందిత ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా విచ్చేసే విఐపి, వివిఐపి ల ప్రోటోకాల్ లో ఎలాంటి అశ్రద్ద లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.   

ఫెస్టివల్ సందర్భంగా సందర్శకులకు అసౌకర్యం కలగకుండా అన్నీ ప్రాంతాల నుండి ఆర్ టి సి బస్సు లను నడపాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేసి పాకల బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలన్నారు. 

 ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి.చిన ఓబులేసు, ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, ఎస్డిసి.శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్. సిఈఓ.చిరంజీవి, డిపిఓ.వెంకటేశ్వర రావు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్.వెంకటేశ్వర రావు, డిఆర్డిఎ పిడి.నారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా,వెంకటేశ్వర రావు, జిల్లా విద్యా శాఖాధికారి శ్రీమతి రేణుక, ఐసిడిఎస్ పిడి శ్రీమతి సువర్ణ, విద్యుత్ శాఖ ఎస్ఈ. వెంకటేశ్వర రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post