చీమకుర్తి లో పాఠశాలలను ఆకస్మికి తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు.



 చీమకుర్తి లో పాఠశాలలను ఆకస్మికి తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

విద్యార్థుల కి అందించే ఆహారంలో మెనూ తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు.ఇండేల లక్ష్మీరెడ్డి చెప్పారు.

మంగళవారం చీమకుర్తి లో ప్రాథమిక ఉన్నత పాఠశాల, గిరిజన గురుకుల బాలుర విద్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మొదట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకి స్వయంగా వడ్డించారు. 

ఆయన కూడా రుచి చూసి బాగుందని కితాబిచ్చారు. అక్కడ స్టాక్ రూమ్ ను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులను రోజు ఫుడ్ మెనూ ప్రకారమే పెడుతున్నారా లేక మేము వస్తున్నామని ఇలా చేసారా అని ఆరా తీశారు. విద్యార్థుల రోజు ఇలానే ఉంటుంది సార్ అని చెప్పడం, ఫుడ్ రుచిగా , నాణ్యంగా ఉండటం వల్ల ఆయన సంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు.

 అనంతరం ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకి అందించే ఆహారం లో మెనూ సరిగా పాటించకాపోవడం , పప్పు పలచగా ఉండటం , కూరగాయలతో కూడిన కూర చెయ్యక పోవటం తో ఆయన వంట సిబ్బందిని మందలించారు. మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, డి.ఎస్.వో.పద్మశ్రీ, డి.ఎం సివిల్ సప్లైస్ అధికారి వరలక్ష్మి, సమగ్ర శిక్షా జిల్లా బాలిక సంరక్షణ అధికారి హేమలత తదితర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post