ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.


 ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.

అనకాపల్లి జిల్లా పోలీసుల కృషిని అభినందించిన ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్ 9 మీడియా జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి(చోడవరం)ఫిబ్రవరి:12 సమాజంలో గురువుగా ఉండి విద్యార్థిని పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన ఒక ఉపాధ్యాయుడికి విశాఖపట్నం పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు ఈరోజు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 2015లో చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ సంచలనాత్మక కేసులో నిందితుడు కొయ్యన తిరుపతిరావు (ఫిజిక్స్ టీచర్) కు నేరం నిరూపితం కావడంతో కోర్టు కఠిన శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

​కోర్టు వెలువరించిన తీర్పు వివరాలు ​కేసు పూర్వాపరాలను పరిశీలించిన గౌరవనీయ పోక్సో కోర్టు, నిందితుడికి ఈ క్రింది విధంగా శిక్షలు ఖరారు చేసింది:

​ప్రధాన శిక్ష: నిందితుడు తిరుపతిరావుకు ఏక కాలంలో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

*జరిమానా:* నిందితుడికి రూ.71,000/- జరిమానా విధించింది. ఒకవేళ ఈ జరిమానా చెల్లించని పక్షంలో, అదనంగా ఏక కాలంలో ఏడు నెలల సాధారణ జైలు శిక్షను అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది.

*బాధితురాలికి ఊరట:* బాధితురాలికి జరిగిన అన్యాయానికి పరిహారంగా రూ.70,000/- చెల్లించాలని నిందితుడిని కోర్టు ఆదేశించింది.

*​కేసు నేపథ్యం:* 

​2015లో చోడవరంలోని చలపతి స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేసిన తిరుపతిరావు, 8వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని మాయమాటలతో ప్రలోభపెట్టి అపహరించాడు. రాజస్థాన్‌కు తరలించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకుని చార్జ్‌షీట్ దాఖలు చేశారు.ఈ సందర్బంగా ​జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు

​ఈ సంచలన తీర్పు వెలువడటం పట్ల అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హర్షం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

​ముఖ్యంగా ఈ కేసులో కీలక పాత్ర పోషించిన: అప్పటి చోడవరం, ​ఎస్సై బి.రమణయ్య,  ఎస్.ఇలియలాస్ అహమ్మద్ (చోడవరం ఇన్స్‌పెక్టర్),బి.సునీల్ (అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ)(దర్యాప్తు అధికారి)

​బట్టి రాజశేఖర్ (స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్)లను ఎస్పీ ప్రశంసించారు. మహిళలు మరియు బాలికల భద్రత విషయంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారు చట్టం నుండి తప్పించుకోలేరని ఈ తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైందని ఎస్పీ పేర్కొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post